ఒమక్రాన్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. దీంతో ధనిక దేశాలు సైతం చిగురుటాకుల వణిపోతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావంతో అమెరికా, బ్రిటన్ లో మరణాలను కూడా సంభవిస్తున్నాయి. ఒమిక్రాన్ కట్టడికి ప్రపంచ దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. భారత్ లో ఈ కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 781మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే 127 మందికి ఈ మహమ్మారి సోకింది.
భారత్ లో ఒమిక్రాన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్వో సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ లో భవిష్యత్ లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్ 20 నుంచి 26 వరకు కేసుల సంఖ్య పరిశీలిస్తే.. భారీగా పెరిగాయని మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మహమ్మారి విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాస్కులు వాడకం, భౌతికదూరం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది.