కొన్ని కొన్ని సినిమాలు ప్రేక్షకులకు చాలా దగ్గర అవుతాయి. అలాంటి సినిమానే మిథునం. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సినిమాలో ఎస్పీ బాలు, లక్ష్మీ మధ్య జరిగే సంభాషణలు చాలా ఆకట్టుకుంటాయి. మరో నటుడు లేకుండా కేవలం ఆ ఇద్దరితోనే సినిమా చేసారు. కథలో పట్టు ఉండటంతో సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఈ తరహా కథలు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని భయపడిన వారికి మంచి సమాధానం ఈ సినిమా.
అయితే ఈ సినిమాలో ఎస్పీ బాలు కంటే ముందు మరొకరిని తీసుకోవాలి అనుకున్నారు తనికెళ్ళ భరణి. ఆయనే ఈ సినిమాకు రైటర్, దర్శకుడు. ముందు ఎల్బీ శ్రీరాం ఈ పాత్ర చేయాలని అడిగారు. మళ్ళీ ఆ ఆలోచన విరమించుకుని బాలు దగ్గరకు వెళ్ళారు. ఎల్బీ శ్రీరాం ఆ తరహా పాత్రలు చాలానే చేసారు. దీనితో ఎస్పీ బాలుని ఫైనల్ చేసారు. ఆ కథ మీద ఎస్పీ బాలుతో కలిసి భరణి పని చేసారు.
ఎస్పీ బాలుని ఎంపిక చేయడంతో ఎల్బీ శ్రీరాం కాస్త బాధ పడ్డారు. ఇద్దరి మధ్య కొన్ని రోజులు మాటలు కూడా లేవు అని అంటారు. చివరికి తనికెళ్ళ భరణినే మళ్ళీ మాట్లాడి అసలు విషయం చెప్పారట. ఇక ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. సినిమాలో కాఫీ పాట కూడా చాలా బాగా హిట్ అయింది. ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వచ్చినా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే మాట వాస్తవం.