ప్రియాభవానీ శంకర్. ‘కళ్యాణం కమనీయం’ సినిమా కోసం సంతోష్ శోభన్ తో జతకట్టిన కోలీవుడ్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా విడుదలైన కళ్యాణం కమనీయం సినిమాలో ప్రియా పెర్ఫార్మెన్స్ సంగతి ఏమోగానీ. ఇటీవల ఆమె ఓ అభ్యంతరకర,ఆసక్తికర వ్యాఖ్య చేసిందని సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. తాను డబ్బు సంపాదించేందుకు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అనిల్ కుమార్ అల్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఆమె వ్యాఖ్యలపై వచ్చిన వార్తలకు స్పందించింది ప్రియ. తానెప్పుడూ అలా చెప్పలేదని గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చింది. అందరూ డబ్బు కోసమే పని చేస్తారని, ఎవరు చేయరని ఎదురు ప్రశ్నించింది.
ఒకవేళ తాను అలా చెప్పినా పెద్ద విషయమేమి కాదని పేర్కొంది. ఈ విషయంలో యాక్టర్లను మాత్రమే టార్గెట్ చేస్తారంటూ నిరాశ వ్యక్తం చేసింది. తానిక్కడివరకు ఎదిగేందుకు చాలా కష్టపడ్డానని, ఎవరినైనా అంత సులభంగా అనేందుకు తాను ఒప్పుకోనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సుదీర్ఘమైన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రియాభవానీ శంకర్ తెలుగులో సత్యదేవ్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది. మరో ఐదు సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.