కరోనా వైరస్ నియంత్రణ కోసం ఔషధం తయారు చేసినట్టు చెప్పుకుంటున్న బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థకు మళ్లీ షాక్ తగిలింది. కరోనా వైరస్ చికిత్సకు ఏ సాంప్రదాయ ఔషధానికి తాము అనుమతి ఇవ్వలేదని, ఆమోదం తెలపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. తాము రూపొందించిన కరోనిల్ ఔషధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చిందని ఇటీవల పతంజలి సంస్థ ప్రకటించిన క్రమంలో.. డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ చేసిన డబ్ల్యూహెచ్‌వో.. అందులో కరోనిల్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. కానీ కోవిడ్-19 చికిత్స కోసం ఏ సాంప్రదాయ ఔషధ సామర్థ్యంపై తాము సమీక్ష నిర్వహించలేదుని.. అలాగే సర్టిఫై కూడా చేయలేదని ట్వీట్‌లో వెల్లడించింది.
ఇదిలా ఉంటే పతంజలి సంస్థ రూపొందించిన కరోనిల్‌కు కేంద్ర ప్రభుత్వంతో పాటు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపిందని, కరోనాకు తాము రూపొందించిన కరోనిల్ తొలి సాక్ష్యాధారిత మందు అంటూ రాందేవ్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ మందును త్వరలోనే 150 దేశాల్లో విక్రయిస్తామని చెప్పారు. కానీ డబ్ల్యూహెచ్‌వో ట్వీట్‌తో అదంతా ఫేక్ అని తేలిపోయింది.
.@WHO has not reviewed or certified the effectiveness of any traditional medicine for the treatment #COVID19.
— WHO South-East Asia (@WHOSEARO) February 19, 2021