డబ్బున్న వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది అనే మాట వాస్తవం. వివాదాలు వచ్చినా సరే వాళ్ళు బయట పడతారు. సామాన్యులు చిన్న తప్పు చేసినా పెద్దగా చేసి చూపించే సమాజం వాళ్ళ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నయనతార, విజ్ఞేశ్ విషయంలో అదే జరుగుతుంది. పెళ్లి జరిగి నాలుగు నెలలు కాకుండానే వీరు తల్లి తండ్రులు కావడం వివాదాస్పదం అయింది.
Also Read:మళ్ళీ ఆర్టెమిస్-1 మిషన్ ప్రయోగం
సరోగసి ద్వారా అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ ప్రాసెస్ తో వీళ్ళు పిల్లలను కంటే మాత్రం కచ్చితంగా అది నేరం అనే మాట వినపడుతుంది. ఆ ప్రాసెస్ లో పిల్లలు పుట్టాలి అంటే తల్లి తండ్రులకు ఆరోగ్య సమస్యలు కచ్చితంగా ఉండాల్సిందే. మరి వాళ్లకు అవి ఉన్నాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అలా ఉన్నా సరే పెళ్లి తర్వాత మాత్రమే అలా చేయాలి.
ఇక అద్దె గర్భం ద్వారా ఎవరు వారికి పిల్లలను కని ఇచ్చారు అనేది సస్పెన్స్ గా మారింది. నయనతార ఫ్రెండ్ ఈ హెల్ప్ చేసినట్టు తెలుస్తుంది. వారి పెళ్ళిలో హడావుడి చేసిన ఆ చిన్న నాటి ఫ్రెండ్ కు నయనతార… రెండేళ్ళ క్రితమే చెప్పింది అని టాక్. తనకు పెళ్లి అయినా సరే తల్లి కావడం ఇష్టం లేదని చెప్తే సరోగసి ఐడియా ఇచ్చింది అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read:మందు బంధు.. గులాబీ లీడర్ కు నోటీసులు..!