ఏదైనా ఇంటర్వ్యూ కి వెళ్తే ఇన్ షర్టు చేసుకోవాలి. ఏదైనా అధికారిక కార్యక్రమాలు ఉంటే ఇన్ షర్టు చేసుకోవాలి. స్కూల్ లో ఇన్ షర్టు తోనే ఉండాలి… ఇలా దాదాపుగా ప్రతీ ఒక్కరి జీవితంలో ఇన్ షర్టు అనేది అలవాటు అయిపోయింది. అసలు ఈ ఇన్ షర్టు అనేది ఎప్పుడు వచ్చింది…? ఇన్ షర్టు ను ఎవరు బయటకు తీసుకొచ్చారు…?
Also Read:టీఆర్‌ఎస్‌లో చేరలేదని కక్ష.. మంత్రిపై హెచ్చార్సీలో ఫిర్యాదు..!
ఇన్ షర్టు అనేది అసలు మన సంస్కృతి కాదు. షర్ట్ వేసుకోవడం, టక్ ఇన్ చేసుకోవడం రెండూ బ్రిటిష్ వాళ్ళ నుంచి ప్రపంచానికి పాకాయి అంటారు. పారిశ్రామిక విప్లవంతోనే ఈ ఇన్ షర్టు అనే టాపిక్ వచ్చింది. కదిలే / తిరిగే యంత్రాలతో పనిచేయడం అక్కడి నుంచే మొదలు కావడంతో వేలాడే అలాగే వదులు వస్త్రాలు యంత్రాలలో చిక్కుకుని ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి.
దీనితో చొక్కాను ఫాంట్ లేదా నిక్కర్ లో పెట్టుకోవాలి అని ఆదేశాలు వచ్చాయి. ఇంగ్లాండ్ లాంటి యూరోప్ దేశాలలో అన్ని కాలాలలోనూ గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్రపు గాలి అక్కడ ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. దీనితో లూజుగా ఉండే వస్త్రాలు వేసుకుంటే అవి గాలికి యెగిరి చూసే వాళ్లకు చిరాకుగా ఉంటాయి. అందుకే ఇన్ షర్టు ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి మార్కెటింగ్ జాబులు చేసే వాళ్ళ వరకు అదే నడుస్తుంది.
Also Read:సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్.. కార్లిటీ ఇచ్చిన రాశి ఖన్నా