రాఘవేంద్ర రావు… చిరంజీవి కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవికి ఎన్నో అద్భుతమైన హిట్స్ ఇచ్చారు రాఘవేంద్ర రావు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ముగ్గురు మొనగాళ్ళు ఫ్యాన్స్ కి మంచి వినోదం ఇచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ నటించారు.
Also Read:ఆ కేసుల్ని వదిలేయొద్దు.. సీజేకు ఎఫ్ఎఫ్‌జీజీ వినతి..!
ఈ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రల్లో కనపడగా… అందులో ఒక పాత్రను చిరంజీవి చేస్తే… మిగిలిన రెండు పాత్రలను డూప్ గా పెట్టారు. ఒకరు చిరంజీవి స్నేహితుడు ప్రసాద్ బాబు కాగా… రెండవ డూప్ గా చిరంజీవి పర్సనల్ పియె సుబ్బారావు నటించారు. ఈ చిత్రంలో పృథ్వీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక మూడు పాత్రలకు చిరంజీవి విభిన్న రీతిలో డబ్బింగ్ చెప్పారు.
ఇక చిరంజీవి, రాఘవేంద్ర రావు ప్రయాణం ఏ విధంగా స్టార్ట్ అయిందో ఒకసారి చూస్తే… ప్రాణం ఖరీదు సినిమా సమయంలో చిరంజీవిని రాఘవేంద్ర రావు చూసారు. ఆ తర్వాత నిర్మాత క్రాంతి కుమార్ ఆఫీసు కి వచ్చిన రాఘవేంద్ర రావు చిరంజీవిని చూసి… ఆయన కళ్ళకు ఫిదా అయ్యారట. తాను తెరకెక్కించే సినిమాలో ఎలా అయినా చిరంజీవిని తీసుకోవాలని భావించారట. ఆ తర్వాత ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్ లో తిరుగులేని మనిషి, కొండవీటి రాజాతో మొదలై అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
ALso Read:సీఎంను మర్యాదపూర్వకంగా కలిశా – విష్ణు