ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ కాదు. తనో పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మూడు సంవత్సరాలైనా ఆగాల్సిందే. చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. త్వరలో రాధేశ్యామ్ రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ఆదిపురుష్, సలార్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా. ఇక్కడి వరకు ప్రభాస్ కు 23సినిమాలయ్యాయి. 24వ సినిమా కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో 25వ సినిమా ఎవరితో చేస్తారన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో మొదలయిపోయింది.
ఈ 25వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మిర్చి సినిమాతోనే కొరటాల శివ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుండి ప్రభాస్ కొరటాలతో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయినా టైం దొరకలేదు. దీంతో ఈ మైల్ స్టోన్ మూవీకి ఇప్పటి నుండే ప్లానింగ్ మొదలైనట్లు చర్చ సాగుతోంది.