బిగ్‌బాస్ సీజన్ -4 మొదలై వారం అవుతోంది. వీకెండ్ వచ్చిందంటే ఎలిమినేషన్ ఎవరనేదానిపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పటికే బిగ్‌బాస్-4 కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదని విమర్శలు వినిపిస్తున్న వేళ.. తొలి ఎలిమినేషన్ పై సర్వత్రా అసక్తి మొదలైంది. మరికొన్ని గంటల్లో ఆ క్యాండిడేట్ ఎవరో తెలిసిపోనుంది.
సోషల్ ట్రెండ్, కొన్ని వర్గాల సమాచారాన్ని బట్టి.. తొలి ఎలిమినేషన్ సూర్యకిరణ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షోలో ఆయన ప్రవర్తనపైనే ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యూయర్స్ కూడా సూర్యకిరణ్‌ను బయటకు పంపించేందుకే ఎక్కువగా ఓట్లు వేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. పైగా శనివారం నాగార్జున కూడా సూర్య కిరణ్‌ను మందలించడం.. అతని ఎలిమినేషన్‌కు ఓ హింట్‌గా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.