ప్రస్తుతం రాజమౌళి ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్1 నుంచి మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు రాజమౌళి. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పాడు.
రాజమౌళి తో సినిమా అనగానే కాదనని హీరో ఉండడు. హీరో ఎవరైనా హిట్టు కొట్టడం పక్కా. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకు 12 సినిమాలను తెరకెక్కించారు. అందులో సింహాద్రి, ఈగ, చత్రపతి, మగధీర, బాహుబలి ఇలా చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.
అయితే రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఇప్పటి వరకు తక్కువ కలెక్షన్స్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది సై. నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ లాభాలను మాత్రం తీసుకురాలేకపోయింది. ఇక ఈ సినిమా ద్వారా రాజమౌళి రగ్బి గేమ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
కానీ నిజానికి మొదట రాజమౌళి నితిన్ హీరోగా అనుకోలేదట. ఓ స్టార్ హీరో ని ఈ సినిమాలో పెట్టుకోవాలని ప్లాన్ చేశాడట. కానీ కుదరకపోవడంతో నితిన్ ను సెలెక్ట్ చేసారట.
ఆరోజు సూపర్ కృష్ణ ఒప్పుకుని ఉంటే… చిరంజీవి పరిస్థితి ఏంటో !!
ఇక ఆ తర్వాత నితిన్ అనుకున్న స్థాయిలో హిట్లను సాధించలేకపోయాడు. ఇక ఇటీవల రంగ్ దే, చెక్, మాస్ట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు. మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.