మలయాళంలో మోహాన్‌లాల్ నటించిన పొలిటికల్ డ్రామా పిక్చర్ లూసిఫర్. సూపర్ విక్టరీ సాధించిన ఈ సినిమాను తెలుగులో రామ్‌చరణ్ రీమేక్ చేయబోతున్నారు. అయితే… సైరా సినిమా ప్రమోషన్‌లో తీరిక లేకుండా ఉన్న చరణ్, లూసిఫర్ విషయంలో ఎందుకు పట్టుదలగా ఉండి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు, ఇంతకీ ఈ సినిమా ఎవరితో చేస్తాడు అన్నది ఫిలింనగర్‌లో జోరుగా చర్చ జరిగింది. ఈ సినిమా చిరంజీవికి గానీ బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసమని అంతా డిసైడ్ అయిపోయినా… ఈ ఇద్దరిలో ఎవరితో చేస్తారన్నది హాట్ టాపిక్. అయితే… సైరా తర్వాత చిరు తన సినిమా కొరటాల శివతో చేయనున్నారు. అయితే… ఆ సినిమా సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేక మలయాళంలో హిట్ సినిమా లూసిఫర్ చేతిలో ఉంచుకోవటం బెస్ట్ అన్న ఉద్దేశంతోనే చరణ్ ఈ అడుగులు వేసినట్లు కనపడుతోంది. ఒకవేళ చిరు కాకపోతే… పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడన్న టాక్ వస్తున్న నేపథ్యంలో, పొలిటికల్ సినిమానే కాబట్టి… బాబాయ్‌తో చేయించవచ్చన్నది అసలు ఆలోచనని తెలుస్తోంది.
చూడాలి మరీ… లూసిఫర్ తెలుగులో చివరకు ఎవరు నటిస్తారు అనేది.