తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న యువకులు చాలామంది సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. కొన్ని సూసైడ్ నోట్ లలో కొందరు టీడీపీ, కాంగ్రెస్ నాయకుల పేర్లు రాసి వుండేవి. వాటి ఆధారంగా అనాడు టీఆర్ఎస్ నాయకులు ఇదే అదునుగా భావించి టీడీపీ, కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసి ప్రజలను, ఉద్యమ కారులను ఆ పార్టీ నాయకుల మీదకు రెచ్చగొటారు. వాళ్ళ మీద దాడులు చేయించారు. ఇంటి ముందు ధర్నాలు చేయించారు. ఆత్మహత్య లకు మీరే కారణం అంటూ వారిమీదకు రెచ్చగొట్టారు. దీంతో ఆత్మహత్యలను పరోక్షంగా ప్రోత్సహించారు. ఆత్మహత్య చేసుకున్న వారిని అమరవీరులుగా కొనియాడారు.
అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆర్టీసీ సమ్మెలో నాటి బలిదానాలు పునరావృతం అవుతున్నట్లు కనపడుతుంది. నా ఆత్మహత్యతో నైనా సమ్మెకు పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ సూసైడ్ నోట్ లు రాస్తున్నారు. పైగా నాదే చివరి చావు కావాలని కోరుతున్నారు. నా చావుకు సీఎం కారణం అంటూ సూసైడ్ రాస్తున్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా సేమ్ ఇలానే చాలామంది యువకులు రాసారు మా చావుకు పలాన నాయకుడు, పలాన మంత్రి కారణం…. నాదే చివరి చావు కావాలి అని. ఆత్మహత్యలతో నైనా సీఎం కేసీఆర్ లో కదలిక వస్తుందేమో అని నా చావు ఉద్యమానికి ఊపిరి అవుతుందేమో అని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల పాటు సూసైడ్ నోట్ రాసుకొని మరి ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఒకరిద్దరు యువకులు నెల రోజుల పాటు సూసైడ్ నోట్ రాసిన వారున్నారు.
తాజాగా మహబూబాబాద్ డిపోలో పని చేస్తున్న నరేష్ రాసిన సూసైడ్ నోట్ చూస్తే నాటి సంఘటనలు గుర్తుకొస్తాయి. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారో ఏ విధంగానైతే సూసైడ్ నోట్ లు రాశారో అలాగే నేడు ఆర్టీసీ కార్మికులు కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ట్రెండ్ మంచిది కాదు. అయితే ఈ పాపానికి టీఆర్ఎస్ కారణం అని చెప్పక తప్పదు. నాడు పరోక్షంగా ప్రోత్సహించి ఆత్మహత్య లకు కారణమయితే నేడు అధికారంలో ఉంటూ ఆర్టీసీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలు కారణంగా ఉన్నాయి.
ఇప్పటికైనా కేసీఅర్ మానవతా దృక్పథంతో ఆలోచించి తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన ఆత్మహత్యలను గుర్తు చేసుకొని ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను నివారించాలి. లేదంటే ఆ పాపం కేసీఆర్ కి చుట్టుకుంటుంది అని కార్మికులు అంటున్నారు. ఇంకా ఎన్ని యాగాలు చేసిన ఆ పాపం తీరదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.