లాలూచీ నాయకులే బాధ్యత వహిస్తారా? - Tolivelugu

లాలూచీ నాయకులే బాధ్యత వహిస్తారా?

విజయారెడ్డి హత్యకు కారకులు ఎవరు? ప్రభుత్వమా? లోప భూయిష్ట ప్రభుత్వ విధానాల? ఉద్యోగుల పై జరుగుతున్న కుట్రలను తెలిసి కూడా తమ ఆర్ధిక లావాదేవీలు ఎక్కడ బయటికి వస్తాయో అని సంఘము ముసుగులో కోట్లకు పడగలెత్తిన ఉద్యోగ సంఘ నాయకుల? తెలంగాణ ఉద్యమం కోసం పిలుపునిచ్చిన ఈ పెద్దమనిషి మాటలు నమ్మి అన్ని ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, సకల జనులు ఏకమై సాధించుకున్న తెలంగాణ ఈ పెద్ద మనిషి కుటుంబ పాలనలొ యీ రోజు అస్తిత్వం కోల్పోయిన సంఘాలు తమ సోదర సంఘమైన ఆర్టీసీ కార్మికులు తమప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటే కనీస మద్దత్తు ఇవ్వాల్సిందిపోయి ఎమ్ ఎల్ సి, ఎమ్ ఎల్ ఏ, కార్పొరేషన్ పదవుల ఆశలో కొంత మంది. తమ అక్రమ సంపాదన ఎక్కడ బయటపడుతుందో అని కొంత మంది.ఉద్యోగ సంఘ నాయకులు చలనం లేకుండా రాష్ట్ర ఉద్యోగుల భవిష్యత్తు ను తాకట్టు పెట్టి తమ స్వప్రయోజనాల కోసం పాలకుల అడుగులకు మడుగులెత్తుతుండటం వాస్తవం కాదా? ఓ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సోదర మేలుకో, లేదా ఈరోజు ఆర్టీసీ రేపు రెవిన్యూ, ఎల్లుండి మనలో ఇంకొకరు కావొచ్చు. ఈరోజు విజయ రెడ్డి హత్య జరిగింది రేపు మనలో ఎవరు బలి అవుతారో చెప్పలేము. ఇకనైనా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఏకమై కోరి తెచ్చుకున్న తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకొనే సమయం అస్సన్నమైనది ఓ ఉద్యోగి మేలుకో నాయకత్వాలను పక్కన పెట్టి నీ హక్కులకై పోరాడు లేకపోతె బానిస బతుకుల పాలవుతావు.
తెలంగాణ రెవెన్యూ చట్టం , రైతులకు ,అధికారులకు వెసులుబాటుగా ఉండేది.

రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం మార్పులు రైతులకు ,అధికారులకు ఇబ్బందిగా మారాయి

*నమస్తే తెలంగాణాలో ..ధర్మగంట తో రైతులు ,అధికారులకు మధ్య వైరాన్ని పెంచింది *

రెవెన్యూ అధికారులపై ధర్మ గంట ప్రజల్లో విషాన్ని నూరిపోసింది

ధర్మ గంట కారణంగానే ప్రజల్లో రెవెన్యూ అధికారులపై ద్వేషం పెరిగింది

సీఎం రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై వ్యవహరించిన తీరే ఎమ్మార్వో స్థాయి అధికారి బలికి కారణమైంది

*లంచాన్ని అరికట్టడం ఏ నాయకునితో సాధ్యం కాదు అలా అరికట్టాలంటే మొట్ట మొదట *రాజకీయనాయకుల అవినీతి నుంచే మొదలు పెట్టాలి కోట్లల్లో రాజకీయ నాయకుల అవినీతి ని వదిలేసి వందలు వేలలో అవినీతికి పాల్పడే ఉద్యోగుల పై ప్రజలలో విద్వేషం నింపిన పాలకులే ఈరోజు విజయా రెడ్డి మృతికి కారణం.

*ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకులే కారణం *

కేసీఆర్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నది నిజం కాదా .?

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,రవీందర్ రెడ్డి ,రాజేందర్ మమతలే ..ఎమ్మార్వో చావుకు కారణం

*రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు .. ఎమ్మార్వో చావుకు ఉద్యోగ సంఘాల తీరే కారణం. ఇది వాస్తవం.

*ప్రభుత్వం మేల్కొవాలి .. అధికారులు ..ప్రజలకు మధ్య సాహుద్బావ వాతావరణం పెంచాలి

Share on facebook
Share on twitter
Share on whatsapp