షో ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ అప్పుడే కోట్లాది మంది మన్ననలు పొందింది. ప్రతి ఒక్కరు కూడా ఆమె గెలవాలని కోరుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు సింగర్ పార్వతి. ఆమెను చూసిన వారు ఈమె పాటలు పడుతుందా అని ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఆమె పాట వింటే ఆశ్చర్యపోతారు. గత రెండు రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల జీ తెలుగులో సరిగమప ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. సింగర్స్ అందరూ కూడా అద్భుతంగా పాడారు. కానీ సంగీత ప్రియుల దృష్టి మాత్రం పార్వతి పై పడింది. పార్వతి కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే పార్వతి కి చిన్నప్పటి నుంచి మంచి సింగర్ అవ్వాలని కోరిక.
ఇంటర్ తోనే చదువుని పక్కన పెట్టింది. అయినప్పటికీ సింగర్ కావాలని కోరిక మాత్రం చంపుకొలేదు. పట్టుదలతో జీ తెలుగు వారు చేస్తున్న సరిగమప ప్రోగ్రాం కు సెలెక్ట్ అయింది. ఆ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో పార్వతీ పాడిన పాటకు జడ్జెస్ ఫిదా అయ్యారు.
అనంత శ్రీరామ్ పార్వతి పై ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి నీకు ఏం కావాలో కోరుకో అని అడగగా మా ఊరికి బస్సు వస్తే చాలు సార్ నాకేమీ వద్దు అంటూ చెప్పుకొచ్చింది.
తన రూపం చూసి అవహేళన చేసిన ఆ వూరి వారే ఇప్పుడు పార్వతి ని చూసి జేజేలు కొడుతున్నారు. నిజానికి బస్సు సౌకర్యం లేకపోయినప్పటికీ కిలోమీటర్ల మేర వెళ్లి సంగీతం నేర్చుకుందట పార్వతి. ఇక ఈమె కథ తెలిసిన వారంతా కూడా పార్వతి మంచి స్థాయికి వెళ్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.