టాలీవుడ్ లో రాశీ ఖన్నాను చూసి జాలి పడే వాళ్ళు ఉంటారు. 8 ఏళ్ళ నుంచి హీరోయిన్ గా చేస్తున్న ఆమెకు మంచి చెప్పుకునే సినిమా మాత్రం రాలేదు. అగ్ర హీరోల సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చినా సరే ఆమె వదులుకుంది అనే వార్తలు విన్నాం. మంచి సినిమాల కథలు విన్నప్పుడు తనకు సూట్ అయ్యే అవకాశం లేదని భావించి వాటికి దూరంగా ఉంది. ఇలా వేరే హీరోయిన్లు ఛాన్స్ లు కొట్టి హిట్ లు కొట్టారు.
ఇక ఆమెకు అద్రుష్టం కూడా కలిసి రాలేదు అనే మాట మనం వింటూనే ఉంటాం. రాశీ ఖన్నాకు బాహుబలి సినిమాలో నటించే అవకాశం వచ్చినా దూరమైంది. రాజమౌళి… అవంతిక అనే పాత్ర కోసం ఆమెను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయనే మళ్ళీ ఈమె మరీ క్యూట్ గా ఉంది ఆ పాత్రకు సెట్ అవ్వదేమో అని భయపడి స్క్రీన్ టెస్ట్ కూడా చేయకుండా వద్దు అనుకున్నారట.
ఆ తర్వాత ఆ పాత్ర తమన్నా చేసింది. మొదటి పార్ట్ లో తమన్నా బాగానే కనపడినా రెండో పార్ట్ లో మాత్రం ఆమె పాత్ర పెద్దగా లేదు అనే చెప్పాలి. కనీసం ఆమెకు డైలాగులు కూడా లేవు ఆ సినిమాలో. దీనిపై ఫీల్ అయింది అని కూడా అన్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత తమన్నా సినిమాల్లో కాస్త స్లో అయింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.