నిన్నట్నుంచి ఓ హాట్ టాపిక్ టాలీవుడ్ ను ఊపేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న విడాకుల సీజన్ కు కొనసాగింపుగా, ఇప్పుడు మరో సీనియర్ హీరో లిస్ట్ లో చేరినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 50 ఏళ్లు దాటిన ఆ నటుడు, తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు. ఈ మేరకు కోర్టులో పేపర్స్ కూడా సమర్పించాడు. ఆయన ఎవరనే విషయం అందరికీ తెలుసు, కానీ బయటకు మాత్రం పేరు చెప్పడం లేదు.
లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు ఆ హీరో. అలా 40ల్లో పెళ్లి చేసుకొని, దాదాపు ఏడేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. కానీ ఇప్పుడు పెళ్లి అనే కమిట్ మెంట్ నుంచి బయటపడాలనుకుంటున్నాడు. అందుకే తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నిజానికి అతడి యాటిట్యూట్ ఆది నుంచి కొంచెం తేడానే. రామ్ గోపాల్ వర్మ భావజాలానికి కాస్త దగ్గరగా ఉండే ఆ నటుడు, ఇప్పుడు అతడి బాటలోనే నడవడానికి సిద్ధమయ్యాడు.
విలన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆ నటుడు, ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. కొన్ని మంచి హిట్స్ ఇచ్చాడు. బాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు. దానికి కూడా అతడి యాటిట్యూడే కారణం. ప్రస్తుతం అడపాదడపా విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ పోషిస్తున్న ఆ నటుడు.. వైవాహిక జీవితాన్ని కూడా వదిలేయడానికి సిద్ధమయ్యాడు.
రీసెంట్ గా నాగచైతన్య-సమంత విడిపోయారు. ఆ తర్వాత ధనుష్ కూడా తన భార్య నుంచి విడిపోయినట్టు ప్రకటించాడు. ఇప్పుడీ నటుడు కూడా విడాకుల వార్తతో హైలెట్ అయ్యాడు. త్వరలోనే తన డైవోర్స్ విషయాన్ని ఈ నటుడు అధికారికంగా ప్రకటించబోతున్నాడు. అప్పటివరకు అతడి పేరును బయటపెట్టడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు.