సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ మొదట్లో ఆలస్యం కాగా, ఆ తర్వాత స్పీడప్ అయ్యింది. ఏప్రిల్ నెలాఖరులోగా మూవీ షూట్ పూర్తికానుంది.
మహేష్ నెక్ట్స్ రాజమౌళితో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ పూర్తయ్యి, కొత్త సినిమాపై ఫోకస్ చేసి… కథ డెవలప్ చేసేందుకు టైం పడుతుంది. దీంతో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని, దాన్ని వచ్చే సమ్మర్ కు రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, సుధ కొంగర, వెంకీ కుడుముల మహేష్ కు ఇప్పటికే కథ చెప్పారు. కానీ మహేష్ మాత్రం ఎవరికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో మహేష్ ఎవరికి ఒకే చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.