టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలు ఒక మంచి హిట్ దొరికినా చాలు అని ఎదురు చూస్తున్న మాట వాస్తవం. అందులో అఖిల్ ముందు వరుసలో ఉంటాడు. అతని కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి. స్టార్ వారసుడు అయినా సరే ఈ రోజు వరకు అతనికి మంచి హిట్ అనేది రావడం లేదు. స్టార్ డైరెక్టర్ దొరికినా సరే అతను ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పుడు ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు ఈ అక్కినేని వారసుడు. నాగార్జున మాట వినకుండా అఖిల్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి అనే చెప్పాలి. మొదటి సినిమా కూడా నాగార్జునకు ఇష్టం లేదని అంటారు టాలీవుడ్ జనాలు. అయినా సరే ఆ కథ అఖిల్ కి నచ్చడంతో నాగార్జున నో అనలేకపోయారు. అయితే ఆ కథ రామ్ చరణ్ చేయాల్సి ఉంది.
ఈ కథ రాసిన వెలిగొండ శ్రీనివాస్… ముందు రామ్ చరణ్ కోసం రాసిన కథ అది. కాని వీవీ వినాయక్ ఆ కథను అఖిల్ కు చెప్పాడు. అఖిల్ ఏ మార్పులు చెప్పకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగార్జున మార్పులు చెప్పినా సరే అఖిల్ వద్దు అన్నారని సమాచారం. ఇప్పుడు ఏజెంట్ సినిమాపై చాలానే ఆశాలుపెట్టుకున్నాడు. ఇక ఆ సినిమా రామ్ చరణ్ చేసి ఉంటే కెరీర్ లో పెద్ద ఫ్లాప్ ఉండేది.