కొన్ని ఫీల్ గుడ్ సినిమాలు ఎప్పుడు టీవీ లో వచ్చినా చూస్తూనే ఉంటాం. కథ బాగుంది అంటే చాలు ఆ సినిమా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. మాస్ సినిమాలు సినిమాలకు కొంత కాలమే ఆదరణ ఉన్నా క్లాస్ సినిమాలకు మాత్రం ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి సినిమానే ఫిదా. ఈ సినిమాలో సాయి పల్లవి మాటలకు ఫాన్స్ ఫిదా అయ్యారు అనే చెప్పాలి. ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది అనే చెప్పాలి.
ఇదిలా ఉంచితే ఈ సినిమా ద్వారా సాయి పల్లవి తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి ఇక్కడి నుంచి. యువతలో ఆమె క్రేజ్ కూడా బాగా పెరిగింది. టాలీవుడ్ లో నిర్మాతలకు ఆమె బాగా దగ్గర చేసిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… ముందు మహేష్ బాబుతో చేయాలి అనుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. మహేష్ బాబు కోసమే కథ రాసుకున్నారు.
మహేష్ పక్కన హీరోయిన్ గా ఒక తమిళ హీరోయిన్ ని అనుకున్నారు. కాని మహేష్ బాబు వద్దు అనడంతో శేఖర్ ఇదే కథను చిన్న మార్పులతో వరుణ్ తేజ్ కి చెప్పారు. ఆయన వెంటనే ఓకే చేయడంతో సినిమా చేసారు. సాయి పల్లవి కోసమే ప్రత్యేకంగా కొన్ని సీన్లు డిజైన్ చేసారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వరుణ్ రెండు సినిమాలను లైన్ లో ఉంచాడు.