ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే ఫాన్స్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. అగ్ర హీరోలు కూడా పూరితో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే వాళ్ళు. పూరి జగన్నాథ్ డిజైన్ చేసే పాత్రలకు పిచ్చ క్రేజ్ వచ్చేది. అమ్మా నాన్న తమిళమ్మాయిలో హీరో క్యారెక్టర్, ఈడియట్ సినిమాలో హీరో క్యారెక్టర్ మొదలు మొన్న చేసిన లైగర్ సినిమా వరకు హీరో పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది.
హీరో నోటి నుంచి వచ్చే డైలాగులకు యూత్ పిచ్చేక్కే వాళ్ళు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కు కష్ట కాలం నడుస్తుంది. ఇటీవల చేసిన లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో చేసిన ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. మైక్ టైసన్ ను కూడా ఈ సినిమాలో పెట్టారు. కాని సినిమా ఇచ్చిన ఫలితం బాగా షాక్ ఇచ్చింది. అయితే ఈ స్టోరీని ముందు ఎన్టీఆర్ కు చెప్పాడు పూరి.
గతంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమా బాగా హిట్ అయింది. అందుకే ఆ కథ ఎన్టీఆర్ కు సూట్ అవుతుంది అని వెళ్ళాడు. కాని ఎన్టీఆర్ కు కథ నచ్చకపోవడంతో తర్వాత చూద్దాం అన్నారట. దీనితో టైం లేకపోవడంతో ఆ కథను విజయ్ దేవరకొండకు చెప్పాడు పూరి. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా వచ్చింది. పూరి ప్రస్తుతం ఏం సినిమా చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు.