రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అవకాశాలను దాదాపుగా ఎవరూ వదులుకునే అవకాశం ఇప్పుడు అయితే ఉండదు. ఒకప్పుడు ఆయన సామార్ధ్యం తెలియక కొందరు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. మంచి కథలు చెప్పినా సరే తమకు సరిపడే అవకాశం లేదని కొందరు హీరోలు వద్దు అనుకున్నారు అనే వార్తలు మనం వింటూనే ఉంటాం. ఇలాగే మర్యాద రామన్న కథ కూడా ఒక హీరో వద్దు అని చెప్పాడని వార్తలు వచ్చాయి.
అలాగే విక్రమార్కుడు, ఈగ సినిమాలను కూడా వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మగధీర సినిమాను వద్దు అనుకున్న హీరో కూడా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు అల్లు అర్జున్. అప్పుడు అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ వచ్చింది. అదే సమయంలో అల్లు అరవింద్ కి రాజమౌళి మగధీర కథ చెప్పాడు. ఆ కథ ఆయనకు నచ్చింది. వెంటనే అల్లు అరవింద్ హీరోగా తానే నిర్మాతగా సినిమా చేయాలి అనుకున్నారట.
వెంటనే అల్లు అర్జున్ కి ఆ కథ చెప్తే బన్నీ వద్దు అన్నాడు. తనకు ఏ మాత్రం సూట్ అయ్యే అవకాశం లేదని చెప్పాడట. దీనితో అదే కథను రామ్ చరణ్ కు చెప్పారు రాజమౌళి. తానే నిర్మాతగా చేస్తాను అని అల్లు అరవింద్ రెడీ గా ఉండటంతో రామ్ చరణ్ కూడా వెంటనే రెడీ అయ్యారు. అలా ఆ సినిమా రామ్ చరణ్ కు వెళ్ళింది. రామ్ చరణ్ రెండో సినిమాగానే మగధీర వచ్చి సూపర్ హిట్ అయింది.