హీరోల కెరీర్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే కెరీర్ మాత్రం కచ్చితంగా ముందుకి వెళ్ళే అవకాశం లేదు. అగ్ర హీరోలు అయినా సరే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తమకు వచ్చిన సినిమాలను గుర్తించి జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కెరీర్ మొదట్లో అయితే మరింత అలెర్ట్ గా ఉండి వచ్చే సినిమాలను పట్టుకోవాలి. అలా చేయలేక కొందరు సినిమా పరిశ్రమ నుంచి బయటకు వెళ్ళిపోయారు.
అందులో ఆకాష్ అనే హీరో కూడా ఒకరు. ఆయనకు ఒకప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. కాని సెకండ్ హీరోగానే ఆయన కెరీర్ ముందుకు వెళ్లి ఆ తర్వాత అసలు కనపడలేదు. వీవీ వినాయక్ ఆయనకు ఒక కథ చెప్తే ఆ కథ తనకు సెట్ అయ్యే అవకాశం లేదని వద్దు అన్నారట. ఆ సినిమా నితిన్ తో చేస్తే సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమానే దిల్. ఆ సినిమా నితిన్ కెరీర్ ని పరుగులు పెట్టించింది.
అలాగే మరో సినిమా కూడా రిజెక్ట్ చేసాడు ఆకాష్. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ కథ కూడా ముందు అతనికే చెప్పినా వద్దు అనడంతో అది వెంకటేష్ కి వెళ్ళింది. ఇప్పుడు తమిళ సీరియల్స్ లో నటిస్తూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు.