టాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతాయి అనే మాట వాస్తవం. అందులో వసంతం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణి నటన మాత్రం చాలా బాగుంటుంది అనే మాట వాస్తవం. ఆకాష్ కూడా చాలా బాగా నటించాడు. వెంకటేష్ ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో బాగా పండుతుంది.
ఫ్రెండ్ కోసం ఎంతటి త్యాగం అయినా చేయడానికి వెంకటేష్ సిద్దపడటం దర్శకుడు చాలా బాగా చూపించాడు. ఇదిలా ఉంచితే ఈ సినిమాకు కళ్యాణి పెద్ద బలం అనే చెప్పాలి. ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందు మరో హీరోయిన్ ని అనుకుంది చిత్ర యూనిట్. అందుకోసం గానూ శ్రేయని ఎంపిక చేసారు ముందు. కాని మళ్ళీ ఆమె సెట్ అయ్యే అవకాశం లేదని భావించారట.
కళ్యాణి అయితే బాగుంటుందని కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే అవకాశం ఉంటుందని భావించి ఆమెను ఎంపిక చేసారట. ఇక ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఆమె కూడా బాగా నటించారు. ప్రస్తుతం కళ్యాణి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే సీరియల్స్ లో కనపడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.