ప్రభాస్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో డార్లింగ్ సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కి ఈ సినిమా కాస్త బలం ఇచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అని చెప్పింది. సినిమాలో కామెడి కూడా బాగా ఆకట్టుకుంది అప్పట్లో. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా.
వాస్తవానికి ఈ సినిమా రామ్ చరణ్ చేయాల్సి ఉంది. కథ రాసుకున్న తర్వాత రామ్ చరణ్ వద్దకు వెళ్లి చెప్పగా రామ్ చరణ్ నో అన్నారు. దాని వెనుక కారణం ఏంటీ అనేది చూస్తే… అప్పటికే ఆరెంజ్ అనే సినిమాను చేస్తూ ఉన్నాడు. అది ఒక సాఫ్ట్ కథ. డార్లింగ్ కూడా అలాంటి స్టోరీనే కావడంతో వద్దని చెప్పాడట. వెంటనే దర్శకుడు ప్రభాస్ వద్దకు వెళ్లి చెప్పగా ప్రభాస్ ఓకే చెప్పాడు.
చివరకు ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయి రామ్ చరణ్ ను ఇబ్బంది పెట్టింది. నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి అప్పుడు. డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంచితే ప్రభాస్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. మూడు సినిమాలను ప్రభాస్ లైన్ లో పెట్టగా త్వరలోనే ఒక సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు.