మన తెలుగు ప్రేక్షకులకు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కొందరి నటన బాగా గుర్తుంటుంది. అందులో రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర, మహానటి సినిమాలో కీర్తి సురేష్ పాత్ర, అలాగే విరాట పర్వంలో సాయి పల్లవి పాత్ర, సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర గుర్తు ఉంటాయి. సినిమా కథకు తగిన విధంగా వాళ్ళను వాళ్ళు మార్చుకున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి.
రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర చేసిన సమంతా అయితే సినిమా కోసం ప్రాణం పెట్టింది అనే మాట వాస్తవం. ఆ సినిమా కథ బలంగా ఉండటంతో పాత్రల విషయంలో సుకుమార్ తీసుకున్న జాగ్రత్తల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాలి, లేదంటే గ్లామర్ గా ఉండాలి అనే భావన నుంచి చాలా మంది బయటకు వచ్చిన సినిమా ఇది అనే మాట వాస్తవం.
ఇక ఈ పాత్ర కోసం సుకుమార్ వాస్తవానికి అనుపమ పరమేశ్వరన్ ని అనుకున్నారట. ఆమెకు కథ చెప్పడం కూడా జరిగింది. కాని ఆమె మాత్రం నో అనడంతో అప్పుడు సమంతాకి కథ చెప్పారట. ఆమె వెంటనే ఓకే అనడంతో సినిమా మొదలయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఈ సినిమా తర్వాత మంచి ఇమేజ్ వచ్చింది. ఈ తరం హీరోలలో అలాంటి పాత్ర చేయాలంటే గట్స్ ఉండాల్సిందే.