అంతర్జాతీయ క్రికెట్ లో ఆడే ప్రతీ ఆటగాడు కూడా చాలా జాగ్రత్తగా జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం సినిమా మరోలా ఉంటుంది. స్వార్ధపూరిత ఇన్నింగ్స్ లు ఆడతారు అనే అపవాద చాలా మందికి ఉంది. మన ఇండియాలో సచిన్, సునీల్ గవాస్కర్, వెస్టిండీస్ లో లారా వంటి వారికి ఈ అపవాదలు క్రికెట్ ఫాన్స్ నుంచి ఉన్నాయి. అసలు అంతర్జాతీయ క్రికెట్ లో స్వార్ధపూరిత ఇన్నింగ్స్ అంటే ఏదో చూస్తే…
వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం గా చెప్పుకునే బ్రయాన్ లారాది. స్వార్ధం కోసమే అతను 400 పరుగులు చేసాడనే విమర్శలు ఉన్నాయి. 2004 సంవత్సరంలో అతను టెస్టు మ్యాచులో చేసిన 400 పరుగుల ఇన్నింగ్స్ పై తీవ్ర విమర్శలు ఇప్పటికీ వినపడుతున్నాయి. జట్టు ప్రయోజనం కోసం కాకుండా తన స్వంత రికార్డుని మెరుగుపరచడం కోసం సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు అని అంటూ ఉంటారు. ఇంగ్లాండ్ పై 1994 లో టెస్టు మ్యాచులో 375 పరుగులు చేసిన లారా పదేళ్ళ తర్వాత తన రికార్డ్ కు మరో ఆటగాడి నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసాడు అని అంటారు.

మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హెడెన్ ఆ రికార్డుని 2003/04 టెస్ట్ సిరీస్ లో జింబాబ్వే పై 380 పరుగులు చేసి కనుమరుగు చేసాడు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత సరైన సమయం చూసుకుని లారా కొత్త రికార్డు సృష్టించే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు. సెయింట్ ఆంటిగ్వా మ్యాచులో ఇంగ్లాండ్ పై ఆ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట మూడు మ్యాచులలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన లారా చివరిదైన నాలుగో టెస్ట్ లో ఆ ఇన్నింగ్స్ ఆడాడు. 582 బంతులు ఎదుర్కొని 43 ఫోర్లతో, నాలుగు సిక్సర్లతో కొత్త రికార్డ్ లిఖించాడు. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ అలాగే ఉండిపోయింది.
Advertisements
Also Read: కోహ్లీ సంచలన నిర్ణయం