పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రీ సినిమా ఒక సంచలనం. పూరి జగన్నాథ్ కెరీర్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ ను యూత్ కి బాగా దగ్గర చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం కూడా బాగా పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన డైలాగులు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పటికీ అవి ఎక్కడో చోట వింటూనే ఉంటాం.
ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కి మంచి ఇమేజ్ వచ్చింది. స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఎదురు చూసేవారు. రవితేజా, నాగార్జున, మహేష్ బాబు వంటి హీరోలకు మరుపురాని విజయాలను అందించారు పూరి జగన్నాథ్. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్నా ఒకప్పుడు పూరికి తిరుగులేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంచితే బద్రీ సినిమా కథ అసలు పవన్ కళ్యాణ్ కోసం కాదట.
ఆ కథను రాసింది అక్కినేని నాగార్జున కోసం. కాని ఆ సమయంలో నాగార్జున మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో మరో ఆప్షన్ లేక పవన్ కళ్యాణ్ కు కథ చెప్పాడు పూరి. వెంటనే పవన్ ఓకే చేయడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. బడ్జెట్ చాలా తక్కువలోనే సినిమా పూర్తి చేయగా అది సూపర్ హిట్ అయి మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత నాగార్జునతో పూరి… శివమణి సినిమా చేయగా అది బంపర్ హిట్ అయింది.