కొన్ని కొన్ని సినిమాలు మిస్ అయిన తర్వాత అవి హిట్ అయితే హీరోలు బాధ పడుతూ ఉంటారు. అలాంటి సినిమానే కిక్. ఆ సినిమాను ఒక స్టార్ హీరో మిస్ అయ్యాడు. ఆ సినిమా రవితేజా కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఆ సినిమాతో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు మార్మోగింది అనే మాట వాస్తవం. హీరో పాత్ర సినిమాకు హైలెట్ అనుకుంటే అందులో ఆయనతో చేయించిన కామెడి కూడా హైలెట్.
ఇక అలీ, బ్రహ్మీ చేసిన కామెడి సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది అని చెప్పాలి. ఇలియానాకు ఈ సినిమా అప్పట్లో మంచి బూస్ట్ ఇచ్చిన మాట వాస్తవం. వాస్తవానికి ఈ సినిమా కథను ముందు జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడు రచయిత వక్కంతం వంశీ. ఆ కథ నచ్చి సురేందర్ రెడ్డి సినిమా చేయాలనుకున్నారు. ఎన్టీఆర్ కు సురేందర్ రెడ్డి ఈ కథ చెప్పగా ఎన్టీఆర్ నో అనడంతో సురేందర్ రెడ్డి కాస్త బాధ పడ్డారు.
ఎన్టీఆర్ నో అనడానికి కారణం వేరే ఉంది. అప్పటికే అశోక్ అనే సినిమా చేసాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీనితో నో అన్నాడు ఎన్టీఆర్. దీనితో కథ వెళ్లి రవితేజాకు చెప్పగా ఆయన వెంటనే ఓకే చేసాడు. సినిమాను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూట్ చేసి రిలీజ్ చేసారు. మంచి హిట్ కొట్టి రవితేజాకి బూస్ట్ ఇచ్చింది. కిక్ సినిమా హిట్ కావడంతో ఊసరవెల్లి సినిమా సురేందర్ రెడ్డి తో చేయగా అది ఫ్లాప్ అయింది.