బాహుబలి సినిమా అనగానే హీరో హీరోయిన్ల పాత్రలు కాకుండా కొన్ని పాత్రలు మన కళ్ళ ముందు ఉంటాయి. అందులో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర అలాగే సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్ర. కరికాల కట్టప్ప నాడార్ అనే పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. రాజ్యానికి నమ్మిన బంటులా, బానిసలా ఉంటూ ఆయన పాత్ర సినిమాను మార్చేస్తుంది. రెండో పార్ట్ అంత హైప్ రావడానికి కట్టప్ప పాత్రే కీలకం.
ఇక కట్టప్ప పాత్ర విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సత్యరాజ్ ని ఎంపిక చేయడం ఆయన లుక్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసారు. ఆయన్ను ఒక యుద్ద వీరుడిగా చూపించారు రాజమౌళి. ఆ పాత్ర ఆయన మినహా ఎవరు చేసినా సరే సూట్ అవ్వదు అన్నట్టుగా ఉంటుంది అనే చెప్పాలి. ఇదిలా ఉంచితే బాహుబలి సినిమాలో ఈ పాత్ర కోసం రాజమౌళి ముందు మరొకరిని అనుకున్నారు.
వాస్తవానికి ఈ పాత్రకు ముందు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ని ఎంపిక చేసారు. ఆయనకు రాజమౌళి జాగ్రత్తగా కథ కూడా చెప్పారు. కాని కథలో తన పాత్ర తన రేంజ్ కి సెట్ అవ్వదు అనుకుని సైలెంట్ అయ్యారట. ఆ తర్వాత రమ రాజమౌళి… సత్యరాజ్ ని ఎంపిక చేసారు. సత్యరాజ్ పాత్ర గురించి వినగానే ఓకే చెప్పేశారు. ఇక వెంటనే ఆయన లుక్ కూడా రెడీ చేసేసి షూటింగ్ స్టార్ట్ చేసారు.