నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో సమరసింహా రెడ్డి సినిమా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందించారు. సిమ్రాన్, అంజలి జవేరి హీరోయిన్స్ గా నటించారు.
జయప్రకాష్ రెడ్డి, పృద్వి తదితరులు కీలక పాత్రలో నటించారు. బి, సి సెంటర్లలో 100 రోజులు ఈ చిత్రం ఆడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటో తెలుసా!! ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ పాత్ర కోసం మొదట మేకర్స్ రాశిని సంప్రదించారట.
చిరంజీవి కోసం కథ రాసి చరణ్ తో సినిమా చేసిన రాజమౌళి !! ఎలానో తెలుసా ?
కానీ రాశి నో చెప్పిందట. అందుకు కారణం కూడా లేకపోలేదట. నడుముపై సీతాకోకచిలుక వాలే సన్నివేశంలో అభ్యంతరం చెప్పిందట రాశి. ఆ సన్నివేశాన్ని తొలగిస్తే నటిస్తానని లేకపోతే చేయనని చెప్పిందట.
దర్శక నిర్మాతలు మాత్రం తొలగించలేమని చెప్పడంతో ఆ సినిమా నుంచి అలా రాశి తప్పుకుందట. అప్పుడు ఆ అవకాశం సిమ్రాన్ కి వచ్చింది. 1999లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. అప్పట్లో ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.
Advertisements
ఇక ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించింది. అలాగే పూర్ణ,జగపతి బాబు కీలక పాత్రలలో నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.