కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి చేసే చిన్న చిన్న తప్పులు లేదా అంచనా తక్కువ వేయడం వంటివి మంచి విజయాలను దూరం చేస్తాయనే మాట వాస్తవం. అలా దూరం చేసుకున్న సినిమాలు సాధించిన విజయాలు చూసి కొందరు షాక్ అవుతూ ఉంటారు. శ్రీదేవి బాహుబలి సినిమాను వదులుకోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆమె ఆ రేంజ్ లో డిమాండ్ చేయడంతో ఆ పాత్ర రమ్యకృష్ణ చేసారు.
ఇక పోకిరి లాంటి సినిమాను పవన్ కళ్యాణ్ కాదు అనడం అప్పట్లో ఒక సంచలనం. కాని ఆ సినిమా ఒక రేంజ్ లో విజయం సాధించింది. అలానే ఐశ్వర్య రాయ్ కూడా కొన్ని సినిమాలను చిన్న చిన్న తప్పులతో వదులుకున్నారు. అలా ఆమె వదులుకున్న సినిమానే అపరిచితుడు. ఆమె వదులున్న తర్వాత సదాకు ఆ సినిమావకాశం దక్కింది. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ ఖాళీ గా లేకపోవడం తో హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.
ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని దర్శకుడు చెప్పడంతో మీడియా కూడా షాక్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆరు నెలలు అయినా సరే సినిమా అవ్వలేదు. సినిమా బడ్జెట్ పెరగడం పట్ల నిర్మాత కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు అప్పట్లో. అయితే సినిమాసాధించిన విజయం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ సినిమా తర్వాత విక్రం రేంజ్ ఎవరికి అందని రేంజ్ లోకి వెళ్ళింది.