ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించిన కొన్ని సినిమాల్లో భాషా సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో రజనీ కాంత్ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. ఇక విలన్ గా రఘువరన్ నటన అయితే అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమాలో డైలాగ్ లు ఇప్పటికి కూడా మనం ఏదోక రూపంలో వింటూనే ఉంటాం. భాషా సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే ప్రేక్షకులు చూస్తారు అనే మాట వాస్తవం. రజనీ కాంత్ కెరీర్ భాషా సినిమాకు ముందు తర్వాత అనే విధంగా ఉంది అనే మాట వాస్తవం. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నగ్మా కూడా చాలా బాగా నటించింది. భాషా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది అనే మాట నిజం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం చూద్దాం.
ఈ సినిమా తమిళంలో విడుదలై సూపర్ హిట్ కావడంతో దీన్ని తెలుగులో కూడా చేయాలని దర్శకుడు భావించాడు. తెలుగులో అప్పటికి రీమేక్ గా ఇది విడుదల చేద్దామని కొందరు నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనితో డబ్బింగ్ చేయకుండా ఆలస్యం చేసి కొందరు హీరోలతో మాట్లాడారు. అందులో బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు కథ చెప్పి రీమేక్ చేయమని అడిగితే ఆయన నో అని చెప్పారట. దీనితో వెంటనే డబ్బింగ్ చేసారు.