గతేడాది డిసెంబర్ నెలలో భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగడం వల్ల తమ దేశంలో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో తయారైన రెండు దగ్గు సిరప్ లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది. దేశంలోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్‌లను చిన్నపిల్లలకు వినియోగించకూడదని వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది పసిపిల్లల మరణాలకు వీటితో సంబంధం ఉన్నదని తెలిపింది.
21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. ల్యాబుల్లో పరిశీలించగా వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. దీంతో ఉజ్బెక్ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకి ఫిర్యాదు చేసింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్‌లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది.
కాగా, గత అక్టోబర్‌లో భారత్‌కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దంటూ డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. పిల్లల్లో ఈ సిరప్‌లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపింది. ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 66 మంది పిల్లల మరణాలకు ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉందని పేర్కొంది.
మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నాయని, ఇవి మానవులకు విషపూరితమైనవి అని తెలిపింది