సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత అభిమానులతో పలువిషయాలను పంచుకుంది. క్రమంలోనే ఓ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఓ క్వశ్చన్ వేశారు.. నాకు సంబంధించినది కాకపోవచ్చు..అయినా అడుగుతున్నాను..ప్లీజ్ మీరు ఎవరితోనైనా డేట్ చేయండి అంటూ సమంత్ కు ట్యాగ్ చేశారు.
దీనిపై సమంత రిప్లయ్ ఇచ్చింది..మీలా నన్ను ప్రేమించే వాళ్లు ఎవరున్నారు అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చింది. ఈ కామెంట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
చైతూతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంత..ఇటీవలే తన అనారోగ్య సమస్యలను సైతం స్వయంగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మళ్లీ పెళ్లి చేసుకోండి లేదంటే కనీసం డేట్ చేయండండీ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
లేటెస్ట్ గా డేటింగ్ విషయంపై ట్యాగ్ చేసిన వ్యక్తికి.. మీలా ప్రేమించే వ్యక్తి ఎవరు దొరుకుతారు అంటూ రిప్లయ్ ఇవ్వటం ద్వారా.. సమంత ఒంటరి తనంతో ఫీలవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
లేకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయనేది వారి ఉద్దేశం.. నెటిజన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నా.. కామెంట్స్ ఏ విధంగా ఉన్నా.. సమంత మాత్రం ఒంటరి తనం నుంచి బయటపడాలని ఫ్యాన్స్ అందరూ సింగిల్ వాయిస్ వినిపించటం విశేషం.