విజయ్, సీనియర్ జర్నలిస్ట్
రాజకీయ అధికార చదరంగం లో అమాయకంగా బలి పశువు అయిన సురేష్ లాగా మరెవ్వరూ బలికావొద్దు. అవినీతి రాజకీయ వ్యవస్థల చేతిలో ప్రజలే దోపిడీకి గురి అవుతారు. పాలకులకు అధికార ఆర్థిక ఎదుగుదల దాహం. పీడితులకు బతుకు పోరాటం అయ్యింది. ఇది పోవాలంటే ఒక అయ్యకు అవ్వకు పుట్టినాం అని అనుకునే వాడు తాను చేయాల్సిన పని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రజ లు కట్టే పన్నులతో వేతనాలు పొందుతున్నామన్న నిజాన్ని గుర్తు పెట్టుకొని మసులు కోవాలి. లంచం అనే పదం ఎక్కడ వినపడ్డా అందుకు బాధ్యులు ఎవరైనా, ఆ వ్యక్తి ఉద్యోగి అయినా రాజకీయ బ్రోకర్ అయినా, రాజకీయ నేత అయినా, అధికారం లో… ప్రతిపక్షం లో వున్న ప్రజాప్రతినిధి అయినా వెంటనే యావజ్జీవ కారాగార శిక్షతో పాటు కఠిన శిక్షలు అమలు అయ్యేలా చట్టం చేయాలి.
దొంగల ఫోటోలు ఎలా బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లలో పెడతారా… అదే విధంగా లంచగొండి అధికారులను కూడా పెట్టాలి. ఈ ప్రక్రియలో అమాయకంగా పాత్ర దారులు బలి అవుతూ, సూత్ర దారులు తప్పించుకుని హాయిగా ఆ ఫలితాలను అనుభవిస్తున్న ఈ దౌర్భాగ్యపు ధమన నీతిని మార్చి ముందుగా సూత్రధారులను, ప్రధాన పాత్రలో అసలు సిసలు దోషులుగా శిక్షించి యావజ్జీవ కారాగార శిక్షతో శిక్షిస్తే గానీ ఈ దురాచారం రూపు మాపడం అయ్యే పని కాదు. సంఘటన జరిగిన వారం పది రోజులు మహా ప్రచారం ఆ తర్వాత అంతా మామూలే. మరో సంఘటన సృష్టించి ప్రజల దృష్టిని మరల్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వాలు అధికారం లో వున్న పెద్ద గద్దలు నిత్యం ఆర్టీసీ కార్మికులు చావులకు కారకులను ఇంతవరకు ఎవ్వరూ ఏమిచేయలేని అసహాయ దుర్యవస్థలో మనం ఉన్నాం.
అధికార పక్షంలో వున్నొడికి గులాంలా నోరు వుండి మాట్లాడలేని మూగ మనుషులం అయ్యాం. ఇలా ఎన్నాళ్ళు భరిస్తారు. చస్తారు. ఆలోచించండి. ఆత్మ విమర్శ చేసుకోండి. ఐక్యం కండి. మంద బలం నిరూపించుకోవడానికి, మన సత్తా చాటడానికి ఆఖరు ఆయుధం. అధికారం అంది పుచ్చుకోవడానికి అది అనుభవిస్తున్న వారు మన చావులకు ఎలా కారణం ఔతున్నారో ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మంచిది.