కరోనా వైరస్ పుట్టుక స్థలం, దాన్ని మూలాలను పరిశోధించే క్రమంలో చైనాకు చేరిన డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నిపుణుల బృందం ఎట్టకేలకు వూహాన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. మనుషుల్లోకి కరోనా వైరస్ సంక్రమించేందుకు ఈ మాంసపు మార్కెటేనని యావత్ ప్రపంచం భావిస్తోంది. ఎందుకంటే తొలి కరోనా కేసు ఇక్కడే బయటపడింది. దీంతో నిపుణుల బృంందం అక్కడ జరిపే పరిశోధనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డబ్ల్యూహెచ్‌వో టీమ్ పర్యటన సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ చూట్టూ బారికేడ్స్ అమర్చారు. మరోవైపు మార్కెట్ దగ్గరికి వచ్చిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని అక్కడి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగబోయారు. కానీ వాటికి సమాధానం చెప్పుకుండానే లోపలికి వెళ్లిపోయారు.
ప్రస్తుత వుహాన్ మార్కెట్ మూసివేసే ఉంది. ప్రజలే కాదు వ్యాపారులు కూడా అక్కడికి వెళ్లేందుకు అనుమతినివ్వడం లేదు. గతంలో వివిధ రకాల మాంసం స్టాళ్లతో ఈ మార్కెట్ చాలా రద్దీగా ఉండేది. అయితే డిసెంబర్ 31,2019న ఆ మార్కెట్‌కు వెళ్లొచ్చిన నలుగురిలో న్యూమోనియా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ రాత్రికి రాత్రే ఆ మార్కెట్‌ను మూసివేశారు.