పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కెమరా మెన్ గంగతో రాంబాబు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను భిన్నంగా చూపించాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ ఫాన్స్ సైతం షాక్ అయ్యేలా ఉంటుంది పవన్ నటన. మీడియాలో పని చేసే వ్యక్తిగా పవన్ ను చూపించాడు. సినిమా కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చింది. హీరోయిన్ గా తమన్నా నటించిన సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణా ఉద్యమ ప్రభావం ఈ సినిమాపై గట్టిగానే పడింది అని చెప్పాలి. సినిమా హాల్స్ కూడా సరిగా లేక సినిమా విడుదల కూడా కాస్త వాయిదా వేసారు. అప్పటికి పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. దీనితో ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇదిలా ఉంచితే ఈ సినిమా వాస్తవానికి పూరి… రవితేజాతో చేయాల్సి ఉంది. కథ కూడా రవితేజా కోసమే రాసుకున్నాడు.
రవితేజ, పూరి జగన్నాథ్ మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఆ కథ వెంటనే రవితేజాకు చెప్పగా విన్న తర్వాత… పవన్ కళ్యాణ్ కు అయితే బాగుంటుంది అని చెప్పాడట. దీనితో పూరి మరో ఆలోచన లేకుండా పవన్ వద్దకు వెళ్ళగా ఆయన వెంటనే ఒకే చేసారు. చిన్న చిన్న మార్పులు చెప్పినా సరే నో అనలేదు పూరి. సినిమా షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేసారు అప్పుడు.