అస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ సహా పలు దేశాల్లో వినియోగిస్తున్నారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ కరోనాను సమర్థవంతంగా అడ్డుకోగలదని విశ్వసించి, అత్యవసర వ్యాక్సినేషన్ కు చాలా దేశాలు అనుమతించాయి.
అయితే, సౌత్ ఆఫ్రికా తమ దేశంలో కోవిషీల్డ్ సమర్థవంతంగా పనిచేయటం లేదంటూ వ్యాక్సిన్ నిలిపివేసిన నేపథ్యంలో… ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. కోవిషీల్డ్ సమర్థవంతంగా, సేఫ్ గా పనిచేస్తుందని… ఇది సౌత్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ను సైతం అడ్డుకోగలదని W.H.O నిపుణుల ప్యానల్ రెకమండ్ చేసింది. కోవిషీల్డ్ ను విరివిగా ఉపయోగించాలని సూచించింది.
అయితే, సౌత్ ఆఫ్రికాలో ఉన్న కొత్త వేరియంట్ పై W.H.O ఇమ్యూనైజేషన్ శాఖ దృష్టి పెట్టిందని… త్వరలోనే తమ టీం కీలక ప్రకటన చేస్తుందని ఓ బ్రెయిన్ ప్రకటించారు.