టాలీవుడ్ లో మహేష్ బాబుని కొత్తగా పరిచయం చేసిన సినిమా పోకిరి. ఈ సినిమాకు ముందు మహేష్ బాబు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వేరు అనే మాట వాస్తవం. మహేష్ కెరీర్ లో ఈ సినిమా అతిపెద్ద విజయంగా నిలిచింది. అప్పట్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 50 కోట్ల వరకూ వసూలు చేసి తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత సూపర్ హిట్ అయింది.
ఇలియానా కూడా మహేష్ పక్కన బాగా సెట్ అయింది. ఈ సినిమాకు హైలెట్ ఏంటీ అంటే మహేష్ బాబు క్లైమాక్స్ లో పోలీస్ గా కనపడటం. ఆ ట్విస్ట్ దెబ్బకు ప్రేక్షకులు లేచి నిలబడ్డారు. అయితే ఈ క్లైమాక్స్ వెనుక వేరే కథ ఉంది. వాస్తవానికి పూరి రాసిన క్లైమాక్స్ మరోలా ఉంది. ఇది విన్న ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ క్లైమాక్స్ మార్చకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పారట.
దీనితో మరోసారి ఆలోచించుకున్న పూరి… క్లైమాక్స్ లో పూర్తిగా మార్పులు చేసి మహేష్ బాబుని పోలీస్ గా చూపించారు. సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ తో బిజినెస్ మెన్ తర్వాత సినిమా చేసే అవకాశం వచ్చినా మహేష్ బాబు రిజెక్ట్ చేసారు అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: కాంతారా సినిమాలో తల్లిపాత్ర వేసిన నటి నేపథ్యం తెలుసా..!?