చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే లాంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతున్నారు అంటే వారికి శత్రువులు పెరుగుతారు. అప్పట్లో ఇది చాలా ఎక్కువగా ఉండేది. కెరీర్ లో ఎదుగుతున్న ఓ హీరో సినిమా రిలీజ్ అయింది అంటే మొదటి రోజు నుంచే సినిమా బాగాలేదు అని ప్లాప్ టాక్ ను తీసుకు వస్తూ ఉంటారు. అలాంటి వారి దెబ్బకు అగ్ర హీరోలు సైతం భయపడేవారు.
ఉదయ్ కిరణ్ కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయ్ కిరణ్ సినిమా నిర్మాతలను ఇబ్బందులు పెడుతుంటాడు అంటూ అప్పట్లో పుకార్లు కొంతమంది పుట్టించారు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ను పరిచయం చేసిన దర్శకుడు తేజతోనే గొడవలు పెట్టుకున్నాడని మరో పుకార్లు పుట్టించారు.
ALSO READ :చిన్న వయసులో చనిపోయిన 10 మంది హీరో,హీరోయిన్స్ … కారణాలు!!
నిజానికి నువ్వు నేను సినిమా 100 రోజుల వేడుకకు ఉదయ్ కిరణ్ చాలా ఆలస్యంగా వచ్చాడు. యూనిట్ కూడా ఉదయ్ కిరణ్ లేకుండానే ఆ వేడుకను జరిపించింది. శత దినోత్సవం అంటే గెట్ టు గెదర్ లాంటిది అనుకున్నాను. అందుకే ఆలస్యంగా వచ్చాను. ఆ రోజు సాయంత్రమే నాకు ఆహ్వానం అందింది అంటూ చెప్పుకొచ్చారు ఉదయ్ కిరణ్. అలాగే కలుసుకోవాలని సినిమా స్క్రిప్ట్ ను వక్కంతం వంశీ రాయగా అది ఉదయ్ కిరణ్ కు నచ్చలేదు. తిరిగి రాయాల్సిందిగా కోరాడట. దీంతో నిర్మాణ సంస్థకు సన్నిహితుడైన కృష్ణవంశీ కి స్క్రిప్టు బాధ్యతను అప్పగించారు.
ALSO READ : తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఎన్టీఆర్ సినిమా తీసిన నటుడు పద్మనాభం ! చివరికేమైందంటే ?
సాధారణంగా అగ్రహీరోలు స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. అలాంటిది ఉదయ్ కిరణ్ మాట్లాడటం అప్పట్లో వివాదంగా మారింది. కాగా ఈ విషయంపై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ… మూడు హిట్లు వచ్చినంత మాత్రాన నెక్స్ట్ సినిమా ప్లాప్ కావాలని కోరుకొను అందుకే స్క్రిప్ట్ విషయంలో కలగజేసుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం అప్పట్లో మూడు సెంటర్లలో 100 రోజులు ఆడి హిట్ టాక్ ను తెచ్చుకుంది.