ఐక్యరాజ్యసమితి వేదికలపై అవకాశం దొరికిన ప్రతిసారి భారత్ పై బురద చల్లటం పాకిస్తాన్ కు అలవాటే. అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎన్ సమావేశాల్లో పాక్ కూడా పాల్గొంది. ఈ సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా కశ్మీర్, లఢఖ్ లు మావేనంటూ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది.
భారత ఫస్ట్ సెక్రటరీగా స్నేహ దూబే మాట్లాడుతూ… పాకిస్థాన్ తీరుపై మండిపడ్డారు. జమ్ము కాశ్మీర్ -లఢఖ్ ఎప్పటికీ భారత్ వే నని ఆమె తేల్చిచెప్పారు. కశ్మీర్, లఢఖ్ ఎప్పటికి మావేనని తేల్చి చెప్పారు. తనదైన పదాలతో ఇమ్రాన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. స్నేహదూబే ప్రసంగం అక్కడున్న అందర్నీ ఆకట్టుకుంది. తూటాల్లాగా పేలిన ఆమె మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం కాగా… ఇంతకు ఈ స్నేహ దూబే ఎవరు జనం సెర్చ్ చేస్తున్నారు.
స్నేహ దూబే ఇండియా తరఫున ఫస్ట్ సెక్రెటరీగా ఉంది. గోవాలో స్కూలింగ్ చేసిన ఆమె, పూణె కాలేజీలో చదువుకున్నారు. ఢిల్లీ జే.ఎన్.యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. 2011లో ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ పాసయ్యారు. 2014లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఎంబసీలో ఆమె తొలి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎన్‌లో ఇండియా ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.