దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని త్వరలోనే తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సర్కార్ ఎప్పుడూ కూడా మౌళిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు.
దీని వల్ల రాష్ట్రంలో ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా కనిపించాయి, కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని స్వయనా న్యూయార్క్ గవర్నరే అన్నారు. ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెక్ పెద్ద పీట వేయాలన్న ఆలోచన కలిగింది.
మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు.
కరోనా ఒక్కటే కాదు, ఇతర మహమ్మారులు ఏవి వచ్చినా వాటిని ఎదుర్కొనే రీతిలో వ్యాక్సిన్లు కావాలన్న నిర్ణయం చేశామన్నారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, దాని గురించి వాళ్లు కూడా ఆసక్తి ప్రదర్శించారని, త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబోతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.