ఇండియన్ సినిమాలో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెతో సినిమాల కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తూ ఉండేవారు. యువ హీరోలకు ఆమె ఒక దేవతలా కనపడేది. నిర్మాతలు అయితే ఆమె డేట్స్ కోసం వెంటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపుగా అన్ని భాషలలో ఆమెకు ఆ క్రేజ్ ఉంది.
అగ్ర దర్శకులు సినిమా చేస్తుంటే ముందు ఆమె పేరునే పరిశీలించి ఆమెను అడిగి ఆమె నో అంటే మాత్రమే మరో హీరోయిన్ వద్దకు వెళ్ళేవారు. ఇదిలా ఉంచితే శ్రీదేవికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారింది. ఆమె బోణీ కపూర్ ని వివాహం చేసుకోవడం అసలు ఆమె తల్లికి ఇష్టం లేదు. ఆమె ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. ముందు మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకోవాలని భావించింది.
ఆయనతో కొన్ని రోజులు ప్రేమలో ఉంది. ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇక శ్రీదేవి తల్లి అయితే కోపంలో బోనీ కపూర్ తో పెళ్లి వద్దు అని చెప్పడానికి చాలా కష్టపడింది. అదే విధంగా పలువురు హీరోలను కూడా శ్రీదేవితో పెళ్లి చేయడానికి ఆమె తల్లి కష్టాలు పడింది. రాజశేఖర్ తో కూడా సంబంధం ఒప్పించింది. అయినా సరే శ్రీదేవి మాత్రం బోనీ కపూర్ నే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందే గర్భవతి అయ్యారు.