ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై యుద్ధం చేస్తోన్న ఈ సమయంలో చైనాలో కొత్త కేసులు నమోదు కాకపోవడం భవిష్యత్తులో మంచి జరుగుతుందనే విశ్వాసం కలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా దేశంలోని వుహాన్ లో గత 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. గత ఏడాది డిసెంబర్ లో వైరస్ ప్రబలిన తర్వాత ఒక కొత్త పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రెసస్ జెనీవాలో నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ‘‘ మన చుట్టూ ఉన్న అత్యంత దారుణ పరిస్థితులు కూడా మారిపోవచ్చని వుహాన్ మిగతా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది‘‘ అని అన్నారు.
చైనా మొత్తంలో రోజుకు కొన్ని కేసులు మాత్రమే నమదవుతున్నాయి. వారు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే. సమస్య ఆసియా నుంచి యూరప్ కు మారడంతో చైనా కంటే కూడా విదేశాల్లోనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే…ఒక వేళ వైరస్ అత్యధిక జన సాంధ్రత గల దేశాలు..బలహీన ఆరోగ్య వ్యవస్థ కలిగిన దేశాలకు వైరస్ సోకితే పరిస్థితి ఏంటనేదేనని టెడ్రోస్ అన్నారు. తమది నిజమైన ఆందోళన…తక్షణం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి…అది జరగకూడదనే కోరుకుందాం అన్నారు.
యువత జాగ్రత్త :
వ్రుద్దులే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నప్పటికీ యువత దీనికి అతీతం కాదని టెడ్రోస్ అన్నారు. ‘‘నేను యువతకు చెబుతున్నాను… ఈ వైరస్ మిమ్మల్ని వారాల పాటు హాస్పిటల్ పాల్జేయవచ్చు. చంపేయనూ వచ్చు‘‘ అని ప్రపంచ బ్యాంక్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ను నియంత్రించడానికి యువత, వ్రుద్ధల మధ్య సంఘీభావం అవసరమని చెప్పారు. యువత వైరస్ గురించి ప్రచారం చేస్తున్నందుకు క్రుతజ్ణతలు తెలిపారు.
ఇటలీలో వైరస్ సోకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 70 ఏళ్ల లోపు వారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ వెల్లడించారు.
మనిషికి..మనిషికి దూరం :
వైరస్ ను నియంత్రించడానికి మొన్నటి వరకు సమాజానికి దూరం పాటించిన మనం ఇప్పుడు మనిషికి..మనిషికి దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో మానసిక స్థైర్యం ఎంతో ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించింది. పొగ త్రాగవద్దని…పొగ తాగే వాళ్లో వైరస్ మరింత ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాట్సాప్ లో వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, వివరాలను అందిస్తుందని ప్రకటించింది.