మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని హిట్ ఇచ్చిన సినిమా ధ్రువ. తమిళంలో జయం రవి చేసిన ఈ సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమాలో విలన్ అరవింద్ స్వామికి కూడా మంచి పేరు వచ్చింది. ఆయన పాత్ర ఎవరు చేసినా సరే ఆ రేంజ్ లో గుర్తింపు వచ్చేది కాదని సినిమా ఫలితం మీద కూడా ప్రభావం చూపించేది అనే కామెంట్స్ వచ్చాయి.
ఈ సినిమాలో నటించిన ఇతర నటులు కూడా చాలా బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు రెండో పార్ట్ కూడా ఉండే అవకాశం ఉందని, తమిళంలో రెండో పార్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే దీని మీద కసరత్తు కూడా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ రామ్ చరణ్ కంటే ముందు మరో హీరోని అడిగారట.
తమిళంలో తన్ని ఒరువన్ అనే పేరుతో ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేసారు. తాజాగా ఆ సినిమా కథ గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని తాను కథ రాసాను అని కాని మరొకరికి ఇది వెళ్ళింది అని చెప్పుకొచ్చారు. జయం రవి… మోహన్ రాజా సోదరుడు. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయింది.