మంచు మనోజ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం అహం బ్రహ్మాస్మి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తానికి క్లైమాక్స్ చాలా కీలకమని, అందుకకే క్లైమాక్స్ లో ఉండే ఓ పాత్ర ర కోసం మనోజ్ ఓ స్టార్ హీరోని సంప్రదిస్తున్నారు.
అహం బ్రహ్మాస్మి లో శర్వానంద్ నటిస్తారని మొదట్లో ప్రచారం జరిగినా… అధికారికంగా ఎవరి పేరు భయటకు రాలేదు. దీంతో ఆ హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.