స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అరణ్య ప్రాంతంలో షూటింగ్ జరగగా అల్లు అర్జున్ తో పాటు మరి కొంత మంది నటీనటులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.
అయితే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటన చేయలేదు. తాజాగా ఇప్పుడు ఆర్య పేరు వినిపిస్తుంది. అయితే ఇది కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరోవైపు బన్నీని ఢీకొట్టే విలన్ ఎవరు అనేది తెలియక అభిమానులు సైతం జుట్టు పీక్కుంటున్నారు.