ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను పోడు భూముల గోడు వీడటం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా టేకులపల్లిలో అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య జరిగిన వాగ్వాదం చోటు చేసుకుంది.
మురళీపాడు బీట్ మోట్లగూడెం కంపార్ట్మెంట్ లో జంగాలపల్లి – మొట్లగూడెం – రాయపాడు ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అధికారులు దున్నటానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
అయితే న్యాయంగా తమకు చెందాల్సిన భూముల్లో అధికారులు స్వాధీనం చేసుకోవడంపై రైతులు తిరగబడ్డారు. పోడు భూముల దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే అటవీశాఖ దౌర్జన్యంగా తమ భూములను స్వాధీనం చేసుకుంటుందని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనూ పోడు భూముల్లో కందకాలు తీసేందుకు అటవీశాఖ అధికారులు రాగా స్థానిక నాయకుల జోక్యంతో వివాదం సద్దుమనిగిందని పేర్కొన్నారు.