అన్నదమ్ములు ఇద్దరూ పోటీ పడబోతున్నారు. అవును అక్కినేని అఖిల్, నాగచైతన్య ఇద్దరూ కూడా చిన్న గ్యాప్ తో తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేశారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెల 8న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలు కూడా ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. అలాగే అభిమానుల్లో కూడా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తాడో చూడాలి.