కాంగ్రెస్ పార్టీలో గ్రూపులున్నాయన్నది కొత్తేమీ కాదు. కానీ పీసీసీ చీఫ్ అంశం ఆ గ్రూపులను మరింత పెంచింది. కానీ లైవ్ లో కనపడలేదు. కానీ ఇప్పుడు ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభతో ఏ నేత రేవంత్ వైపు అన్నది క్లారిటీ రాబోతుంది.

రేవంత్ సభకు దూరంగా ఉండాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొంతమంది నేతలతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. రేవంత్ సభకు ఎవరూ వెళ్లొద్దని, పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదంటూ ఫోన్స్ చేసినట్లు ఆ ప్రచార సారాంశం.
రేవంత్ రెడ్డి రావిరాల సభ కాస్సేపట్లో జరగనుంది. ఈ సభకు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క వంటి నేతలు ట్రాక్టర్ల ర్యాలీ నుండే తోడుగా ఉన్నారు. దీంతో సభ స్టేజ్ పై ఎవరుంటారన్నది కాంగ్రెస్ లోనే కాదు, ఇతర పార్టీల నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది.క్యాడర్ రేవంత్ వైపే అని ఇప్పటికే పాదయాత్ర, ట్రాక్టర్ ర్యాలీ తో ఓ స్పష్టత వచింది..ఇక లీడర్స్ ఎవరివైపు అనేది సభలో స్పష్టత వస్తూంసి అని యాడ్ చెయ్